Posted on 2026-08-30 15:04:21
డైలీ భారత్, తంగళ్ళపల్లి: ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు అన్నారు.తంగళ్ళపల్లి మండలం తాడూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం కాంగ్రెస్ నాయకులు భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలపై ఆర్థిక భారం పడకుండా ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిమెంట్, ఇసుక తదితర నిర్మాణ సామగ్రి ధరలను తగ్గిస్తూ జీవో విడుదల చేసిందని, ఇది పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని అన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి అవకతవకలు, అక్రమ వసూళ్లకు తావులేదని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం ఇళ్లు మంజూరవుతాయని, ఇళ్ల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్ కోఆర్డినేటర్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాళ్ల నర్సింగం, సర్పంచ్ సాధి, డైరెక్టర్ శైలజ, సెక్రటరీ కవిత, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, బండి పర్శరం, చేనామనేని ప్రశాంత్, రాజలింగం, ఎగుర్ల ప్రశాంత్, గుగిళ్ల భారత్, శ్రీరామ్, మిరాల శ్రీనివాస్, రంగు శ్రీనివాస్, రవి, ప్రేమ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >