Posted on 2026-08-30 15:06:17
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో రైతుల నుండి భూములను తీసుకునే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని బీజేపీ వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేష్ డిమాండ్ చేశారు.1970లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో మర్రిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 748లో ఉన్న సుమారు 200 ఎకరాల భూమిని పేద మధ్యతరగతి కుటుంబాలకు సాగు చేసుకునేందుకు కేటాయించారని, అప్పటి నుండి ఆ కుటుంబాలు తరతరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాల డైరీ ఏర్పాటు పేరుతో ఈ భూములను తీసుకునే ప్రయత్నం జరిగినప్పుడు రైతులు వ్యతిరేకించారని, అప్పుడు రైతులకు మద్దతుగా పోరాటంలో పాల్గొన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే భూములను తిరిగి తీసుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.తరతరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద రైతుల పొట్టకొట్టేలా వ్యవహరించడం సరికాదని, బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే రైతులతో సమావేశమై న్యాయం చేయాలని కోరారు.రైతులకు న్యాయం జరగని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తోటా శేఖర్, ఉపాధ్యక్షులు లింగంపల్లి కుంటయ్య, కార్యదర్శి గుమ్మడి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు లక్కం తిరుపతి, సాగర్ల నరేష్, మారం రాజేందర్, లింగంపల్లి రాజు, సీనియర్ నాయకులు చిట్టిపెళ్లి రవి, కిషోర్, ఆకుల బాబు, గోపు రమేష్, సామోజు గౌతమ్, బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >