Posted on 2026-08-30 13:59:15
పెన్షన్ల గడువును 2 నెలలు పొడిగించాలి : సిరిసిల్ల కౌన్సిలర్ వైష్ణవి నాగరాజు డిమాండ్
రేపటితో ముగియనున్న పెన్షన్ గడువు - పొడిగించాలని డిమాండ్
డైలీ భారత్,సిరిసిల్ల: వృద్ధులు, బీడీ కార్మికుల పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని, పెన్షన్ దరఖాస్తు గడువును మరో రెండు నెలలు పొడిగించాలని సిరిసిల్ల పురపాలక సంఘం 10వ వార్డు కౌన్సిలర్ బోల్గం వైష్ణవి నాగరాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటివరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు.
కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్ కోసం అర్హత ఉన్న అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని, ఇది శోచనీయమని అన్నారు. "వృద్ధులు, బీడీ కార్మికులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదా?" అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వికలాంగుల సదరం (SADAREM) సర్టిఫికెట్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. గడువు ముగిసిన సర్టిఫికెట్లను పునరుద్ధరించే అవకాశం లేకపోవడం, సదరం క్యాంపులను క్రమం తప్పకుండా నిర్వహించకపోవడం వల్ల అర్హులైన వికలాంగులు పెన్షన్ పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాలపరిమితి లేకుండా సర్టిఫికెట్ల జారీ విధానాన్ని సరళీకృతం చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువు ఆగస్టు 31 తో ముగుస్తున్న నేపథ్యంలో, సదరం సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోవడం, సాంకేతిక సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల వేలాది మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అందువల్ల మానవతా దృక్పథంతో గడువును మరో 2 నెలలు పొడిగించాలని, అర్హులందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో నిరుపేద వృద్ధులు, బీడీ కార్మికులు, వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.
బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >