| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

డైలీ భారత్, కామారెడ్డి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షట్కర్

కామారెడ్డి నియోజకవర్గం బిక్నూర్ మండలం రామేశ్వరం పల్లి గ్రామంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ...

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాం. 

ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా అందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం కలుగుతుంది.అని తెలిపారు.

ప్రజల అవసరాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్లు, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.అని షబ్బీర్ అలీ తెలిపారు.

ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ మాట్లాడుతూ.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. అని అన్నారు.

కేంద్రం మరియు రాష్ట్ర స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పథకాలను సమన్వయంతో అమలు చేయడానికి కృషి చేస్తున్నాం. 

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది.అని ఎంపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాణి రాజు, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఎడ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్, గ్రామ వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్, సొసైటీ చైర్మన్లు భీంరెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, సర్పంచులు రేఖ, కృష్ణ రావు, లింగ రెడ్డి, సంతోష్, సీనియర్ నాయకులు విజయ్ గౌడ్, మహిపాల్, రాజబాబు, అంకం రాజు, యాదవ రెడ్డి, స్వామి, దయాకర్ రెడ్డి, పండ్ల రాజు, SC సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, యువజన కాంగ్రెడ్ మండల అధ్యక్షులు వెంకటేష్, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, శ్రీకాంత్, కోటను స్వామి, రాకేష్, సతీష్, ధర్మయ్య, కిరణ్, సురేష్ పాత్రికేయ మిత్రులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Previous కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Next ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
ADVERTISEMENT