| Daily భారత్
Logo




40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

News

Posted on 2026-08-29 09:21:01

Share: Share


40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

కాంగ్రెస్ సర్కార్ పై రెడ్డబోయిన గోపి ఫైర్

డైలీ భారత్, సిరిసిల్ల:తెలంగాణలో 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద శనివారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 120 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా విస్మరించిందన్నారు. ఫీజు బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో వేలాది మంది పేద విద్యార్థులు కళాశాలల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ను ఎందుకు విడుదల చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే విద్యార్థుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

విద్యార్థులందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >