| Daily భారత్
Logo




నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

News

Posted on 2026-08-28 15:24:06

Share: Share


నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్

రూ.91 వేల నకిలీ కరెన్సీ, కారు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని పర్బణి జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.500 విలువైన 182 నకిలీ నోట్లు, మొత్తం రూ.91,000 విలువైన నకిలీ కరెన్సీతో పాటు నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

తేదీ 26.08.2026న ఉదయం సుమారు 10:50 గంటల సమయంలో పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు MH-38-V-2837 నంబర్ గల కారులో నలుగురు వ్యక్తులు వచ్చి రూ.2,000 విలువైన పెట్రోల్ కొట్టించుకుని, రూ.500 విలువైన నాలుగు నోట్లను అందజేశారు. అవి నకిలీ నోట్లు అని గుర్తించిన పెట్రోల్ బంక్ క్యాషియర్ శ్రీకాంత్ రెడ్డి వారిని ఆపేందుకు ప్రయత్నించగా, వారు ఆగకుండా కారులో పరారయ్యారు. ఈ ఘటనపై క్యాషియర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిట్లం పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 158/2026, సెక్షన్ 178, 179, 318(4) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.

కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. నకిలీ కరెన్సీని మరింతగా చలామణి చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్న నిందితులను ధర్మారం టోల్ ప్లాజా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో నిందితులు హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీని సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. నకిలీ కరెన్సీని సరఫరా చేసిన వ్యక్తులతో పాటు ఈ నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితుల వివరాలు

1. రాహుల్ రావుసాహెబ్ అవాడ్, వయస్సు 23 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, బాబుల్‌గావ్ గ్రామం, పర్బణి జిల్లా, మహారాష్ట్ర.

2. ప్రతీక్ ధ్యానోబా డాల్వే, ఉమ్రి బాబుల్‌గావ్ గ్రామం, పర్బణి జిల్లా, మహారాష్ట్ర.

3. భీమ్ శంకర్ రామ్‌రావ్ వైద్య, టాక్లీ దొబడే గ్రామం, పర్బణి జిల్లా, మహారాష్ట్ర.

నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నవి

- రూ.500 విలువైన 182 నకిలీ నోట్లు

- మొత్తం రూ.91,000 విలువైన నకిలీ కరెన్సీ

- స్విఫ్ట్ డిజైర్ కారు (MH-38-V-2837)

- 3 మొబైల్ ఫోన్లు

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు, పిట్లం పోలీస్ సిబ్బంది శైలేష్, రాము, వెంకటేష్లను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS అభినందించినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి వెల్లడించారు.

ప్రజలకు విజ్ఞప్తి

తక్కువ మొత్తంలో అసలు డబ్బులు ఇస్తే రెట్టింపు నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దు. నకిలీ కరెన్సీని కొనుగోలు చేయడం, కలిగి ఉండడం లేదా చలామణి చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఇలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నాము.

Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >