Posted on 2026-08-28 17:25:46
డైలీ భారత్, సిరిసిల్ల:నూలు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్నలు మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర చేపట్టారు. మార్కండేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర నేతన్న చౌక్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది...
ఈ సందర్భంగా నేతన్న చౌక్ వద్ద నేతన్నలు ప్రత్యేకంగా నేసిన వస్త్రాన్ని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, నేతన్నల విగ్రహాలకు సమర్పించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని నేతన్నలకు నూలు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ సిరిసిల్ల అంటేనే నేతన్నలు.. నేతన్నలు అంటేనే సిరిసిల్ల అనే గుర్తింపు ఉందని ఆది శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నేతన్నలకు చేతినిండా పని కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే గత బకాయిలను చెల్లించే చర్యలు చేపట్టిందని తెలిపారు...
ఏడాదిలో కనీసం ఎనిమిది నెలల పాటు పని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, గత ఏడాది ఆరు కోట్ల మీటర్లకు పైగా చీరల ఉత్పత్తి జరిగిందని చెప్పారు. పవర్‌లూమ్ కార్మికులు, నేతన్నలకు కోటి చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఇప్పటికే నాలుగున్నర కోట్ల మీటర్ల చీరలకు సంబంధించిన పని కల్పించినట్లు పేర్కొన్నారు...
నేతన్నలకు రూ.25 కోట్ల రుణమాఫీ వంటి చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, రైతన్నలతో పాటు నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నూలు పౌర్ణమి సందర్భంగా నేతన్నలు చేపట్టిన పోగు బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు..
మార్కండేయ స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతులు, నేతన్నలు సహా అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని విప్ ఆకాంక్షించారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >