Posted on 2026-08-29 15:08:39
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని కాంగ్రెస్ కమిటీ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి నుంచి కేసీఆర్ కూడా పోటీ చేశారని.. ఆయనకు ఇక్కడి ప్రజల సమస్యలపై, పట్టణ అభివృద్ధిపై బాధ్యత ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గురువారం వరదలపై చేపట్టిన నిరసన సందర్భంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, పిండ ప్రదనాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో రూ.1,400 కోట్లు ఉన్నాయని, అందులో నుంచి రూ.100 కోట్లు తీసుకొచ్చి కామారెడ్డి అభివృద్ధికి కృషి చేయాలని సవాల్ విసిరారు. గత రెండున్నరేళ్లలో గంప గోవర్ధన్ ఏనాడూ ప్రజల పక్షాన మాట్లాడింది లేదని, ప్రభుత్వ పథకాలపై స్పందించిన దాఖలాలు లేవని విమర్శించారు.
గతేడాది వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తమ నాయకుడు షబ్బీర్ అలీ స్పందించి సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలను చివరికి సీఎంను కూడా కామారెడ్డికి రప్పించారని తెలిపారు. సీఎం వచ్చి వెళ్లాక ప్రభుత్వం సత్వర పనుల కోసం రూ.10 కోట్లు మంజూరు చేసిందని, వరద నష్టంపై షబ్బీర్ అలీ సీఎంకు వివరించి నిధులు తీసుకువచ్చారని పేర్కొన్నారు.సీఆర్ఆర్ ఫండ్స్ కింద రూ.50 కోట్ల ప్రతిపాదనలు పంపితే రూ.25 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఎఫ్డీఆర్ కింద రూ.16 కోట్లు, యూఐడీఎఫ్ కింద రూ.18.70 కోట్లు వచ్చాయని వెల్లడించారు. వరద నీరు సజావుగా వెళ్లేందుకు రూ.8.80 కోట్లతో స్ట్రాం కాలువల నిర్మాణానికి నిర్ణయించామని, టెండర్ కూడా పూర్తయిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టలేని పనులను తమ నాయకుడు చేపిస్తున్నారన్నారు. సీఎంపై, తమ నాయకులపై మాజీ ఎమ్మెల్యే అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. తమ ప్రభుత్వ హయాంలో కామారెడ్డి అభివృద్ధి చెందిందని చెబుతున్నారని, అదే నిజమైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను కామారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారో సమాధానం చెప్పాలని నాయకులు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు గన్మెన్లను పెట్టుకోగా లేనిది నక్సలైట్ల దాడిలో తప్పించుకున్న తమ నాయకుడికి గన్మెన్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. బతికున్న వ్యక్తులకు పిండ ప్రదానం చేయడం హిందూ సాంప్రదాయం కాదని, తక్షణమే బీఆర్ఎస్ నాయకులు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే బయటకు రావడం సంతోషకరమని, ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడంలో తప్పు లేదని, అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్, మాజీ ఎంపీపీ పండ్ల రాజు, కామారెడ్డి సొసైటీ ఛైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులుఇప్ప శ్రీనివాస్, గుడుగుల శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులుకాళ్ళ గణేష్, కౌన్సిలర్ అంజాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >