Posted on 2026-08-30 12:11:35
న్యాయం చేయాలని బీజేపీ నేత తంబళ్ల రవి డిమాండ్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకె శిరీష కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ తుక్కుగూడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీష శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని రూమ్‌కు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం రూమ్మేట్ డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చి చూడగా శిరీష గాయాలతో రక్తసిక్తమై విగతజీవిగా పడి ఉంది.
కుటుంబానికి ఆసరాగా ఉంటుందనుకున్న బిడ్డ ఇలా దారుణంగా మృతి చెందడంపై చౌటిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి కొన్నాళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి రామలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని, పోలీసులు లోతుగా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని తంబళ్ల రవి కోరారు. బాధ్యులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పసుమర్తి పుల్లారావు, ధార నాగేశ్వరరావు, గుడా ముత్యాలరావు, పూచి ప్రసాద్, కారం రత్నకుమారి, ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్‌కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >