Posted on 2026-08-30 17:15:04
డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారుల హక్కుల సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల సంఘాల JAC నూతన చైర్మన్ గజ్జెల దేవరాజ్ స్పష్టం చేశారు.
సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో ఆదివారం జిల్లాలోని వివిధ ఉద్యమకారుల సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా తెలంగాణ ఉద్యమకారుల JAC చైర్మన్‌గా గజ్జెల దేవరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఉద్యమకారుల త్యాగాలకు తగిన గౌరవం దక్కే వరకు JAC తరపున అలుపెరగని పోరాటం చేస్తానని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో JAC గౌరవ అధ్యక్షులు బుస్స వేణు, రాచర్ల వెంకన్న, కర్నె లక్ష్మి, పత్తిపాక పద్మ, శంకర్, అక్కెనపెల్లి కరుణాకర్, మాజీ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్, బండి దేవదాస్, నిమ్మశెట్టి విజయ్, వెంగల శ్రీకాంత్ గౌడ్, మడుపు వనజ తదితరులు పాల్గొని నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >