| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద జరిగిన గొడవ కలకలం రేపింది. పెళ్లి వేడుకకు వచ్చి దూషిస్తూ దాడి చేసి చంపుతామని బెదిరించారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల BY నగర్ కు చెందిన K. శ్రావణ్ కుమార్ కు గతంలో గోదావరిఖనికి చెందిన సౌమ్యతో వివాహం జరిగింది. అనంతరం భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సౌమ్య గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో భర్తపై గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టింది. ప్రస్తుతం ఆ కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి.

ఈ క్రమంలో శివనగర్ శివాలయం వద్ద శ్రావణ్ కుమార్ సోదరి వివాహం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సౌమ్య తన తల్లిదండ్రులు, సోదరుడు మరికొందరితో కలిసి అక్కడికి వచ్చింది. సౌమ్యను కాపురానికి ఎందుకు తీసుకెళ్లడం లేదంటూ వాగ్వాదానికి దిగినట్లు శ్రావణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనను, తన బంధువులను అసభ్య పదజాలంతో దూషిస్తూ చేతులతో దాడి చేశారని, సౌమ్యను కాపురానికి తీసుకెళ్లకపోతే చంపుతామని బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారని బాధితుడు ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Previous ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Next హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
ADVERTISEMENT