| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఫారెన్ టూరిస్ట్‌పై అత్యాచారం

ఫారెన్ టూరిస్ట్‌పై అత్యాచారం

డైలీ భారత్, ఉదయపూర్: ఉదయపూర్‌లో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉద్యోగి ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రకటన షూట్ కోసం వీసాతో ఏడాదిగా ఉంటున్న ఆమెను బయటకు తీసుకెళ్తానని చెప్పి హోటల్ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉదయపూర్‌లో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉద్యోగి ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. బాద్గావ్ ప్రాంతంలోని టైగర్ హిల్స్‌లోని ఒక రెస్టారెంట్‌కు ఓ ఫ్రెంచ్ మహిళ స్నేహితులతో వెళ్లింది. అయితే ఓ ప్రకటన షూట్ కోసం వీసాపై ఏడాది నుంచి ఆ మహిళ ఉదయపూర్‌లో ఉంటోంది.

ఈ క్రమంలో కొంతమంది ఫ్రెంచ్ పర్యాటకులు గ్రీక్ ఫామ్ అనే రెస్టారెంట్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత సిద్ధార్థ్ అనే ఓ వ్యక్తి ఆ ఫ్రెంచ్ మహిళను కారులో బయటకు తీసుకెళ్తానని చెప్పి తన హోటల్ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో బాధిత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Previous తెలంగాణలో 77 వేల రేషన్‌కార్డులు రద్దు
Next డ్రగ్స్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్
ADVERTISEMENT