| Daily భారత్
Logo




రైతులకు పోలీసుల విజ్ఞప్తి

News

Posted on 2025-04-07 13:41:36

Share: Share


రైతులకు పోలీసుల విజ్ఞప్తి

- రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు.

- ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.

 నరసింహ ఐపిఎస్,.ఎస్పి సూర్యాపేట జిల్లా.

డైలీ భారత్, సూర్యాపేట: రైతులు రోడ్లపై ధాన్యము ఆరబోయడం వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని, రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోయడం ప్రమాదకరమని ఎవరు కూడా రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయవద్దని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఒక ప్రకటనలో అన్నారు. ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులు గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు అన్నారు. కావున రైతులు గమనించి సహకరించాలి అన్నారు. 

గత సంవత్సరం యువకుడు ద్విచక్ర వాహనం పై రాత్రి సమయంలో చివ్వెంల నుండి వట్టిఖమ్మంపాహడ్ వైపు వెళుతుండగా రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం గమనించక ప్రమాదానికి గురై ఒకరు మరణించారు, తుంగతుర్తి పరిధిలో వెలుగుపల్లి స్టేజి వద్ద ఆరబోసిన ధాన్యం కప్పను గమనించక రాత్రి సమయంలో ద్విచక్ర వహనదారుడు ప్రమాదానికి గురై ఒకరు మరణించారు. సూర్యాపేట రూరల్ పరిధి బాలెంల వద్ద కూడా ఇలాంటి ప్రమాదానికి గురై వ్యక్తి చనిపోయారు అని ఎస్పి గారు గుర్తు చేశారు. కొన్ని ప్రమాదాల్లో వ్యక్తులు గాయాలపాలయ్యారు అన్నారు.

ధాన్యం అరబోయడం వల్ల ప్రమాదాలు జరిగి ఎవ్వరూ ప్రాణాలు కోల్పోవద్దు అని కోరారు, కావున రైతులు గమనించి రోడ్లపై ధాన్యం. ఆరబోయవద్దు అని విజ్ఞప్తి చేశారు. పోలీసు సూచనలు పాటిస్తూ సహకరించాలి అన్నారు. పోలీసు అధికారులు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >