Posted on 2025-04-07 21:54:55
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ తో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35) ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిన్నారు.
రాత్రి సమయంలో వారిద్దరికీ వాంతులు, విరేచనాలు కావడంతో వారిని కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయత్రం పుష్పలత మృతి చెందింది. నిహాల్ కు మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం ఉదయం మృతి చెందాడు.
తల్లి, కుమారుడి మృతి వార్తతో రుద్రంగిలో విషాదం నెలకొంది. పుష్పలత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:38:05
Readmore >