డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, SIR ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం, అలాగే BLAల బాధ్యతలు, విధులపై స్పష్టత తీసుకురావడం లక్ష్యంగా సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, సర్పంచ్ అభ్యర్థులు, కౌన్సిలర్ అభ్యర్థులతో పార్టీ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు వైరా నియోజకవర్గ ఇంచార్జ్ ఆర్‌జేసీ కృష్ణ , వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు సమన్వయ సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఆర్‌జేసీ కృష్ణ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండలాల్లో గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా నిర్వహించి ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అలాగే SIR ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు. బూత్ స్థాయిలో BLAలు చురుకుగా పనిచేసి ఓటరు జాబితాల సవరణ, పరిశీలన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.2026 జూన్ 22న కమ్మ వారి కళ్యాణ మండపం వైరాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, SIR ఓటరు నమోదు మరియు BLA అవగాహన కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ , మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు , ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆర్‌జేసీ కృష్ణ , లకావత్ గిరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని వారు కోరారు
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.