| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జూలూరుపాడు లో ఆరోగ్య జీవన యాత్ర సభ్యుల సమక్షంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో నిత్యం యోగా చేస్తున్న ఆరోగ్య జీవన యాత్ర యోగ సభ్యులు యోగ డే రోజున యోగాసనాలతో పాటు ధ్యానం చేశారు అనంతరం జూలూరుపాడు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి యోగ ప్రాముఖ్యతను తెలిపే నినాదాలు ఇచ్చారు అనంతరం వెంగన్నపాలెంలోని స్మశాన వాటిక యందు రావి మరియు మర్రిచెట్టులను నాటి సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు ఈ సందర్భంగా యోగ ట్రైనర్ బోసు ను సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక శ్రమ లేకపోవడంఆహారపు అలవాట్లలో మార్పు వచ్చిందని అందువల్లనే చిన్నవయసులో  బిపి షుగర్ గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు పిసిఒడి థైరాయిడ్ కంటి చూపు మందగించడం లాంటిది జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాకింగ్ యోగా ధ్యానం లాంటివి చేయాల్సిన పరిస్థితి ఉందని వీటితో పాటు ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని అదేవిధంగా జంక్ ఆహారంజోలికి వెళ్ళవద్దని మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ శారీరక వ్యాయామం చేయాలని అన్నారు.

Previous ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక సంపదల్లో యోగా ఒకటి
Next బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
ADVERTISEMENT