Posted on 2026-06-21 17:54:40
పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా భగ్నం
పక్కా ప్లాన్‌తో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన కామారెడ్డి పోలీసులు!
కామారెడ్డి పోలీసుల అప్రమత్తత.. 387.128 కిలోల భారీ గంజాయి సీజ్…
ముగ్గురు నిందితులు అరెస్ట్ & రిమాండ్‌కు తరలింపు.. అశోక్ లేలాండ్ వాహనం, మొబైల్స్, నగదు స్వాధీనం!
స్మగ్లర్ల స్కెచ్ ఎంత పెద్దదైనా, రూట్ మార్చినా కామారెడ్డి పోలీసులకు దొరకాల్సిందే
యువత భవిష్యత్తే కామారెడ్డి పోలీసుల ప్రధాన ధ్యేయం.. . డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం!
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి: సమాజ రక్షణే ధ్యేయంగా, ప్రజలు ముఖ్యంగా యువత భవిష్యత్తే శ్వాసగా కామారెడ్డి పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ కవచ్’ (Operation Kavach) పేరుతో జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు, నాకాబందీలు, ప్రత్యేక నిఘా చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్మగ్లర్లు ఎంత తెలివిగా ప్లాన్ మార్చి అక్రమ రవాణాకు పాల్పడినప్పటికీ.. పోలీసుల చాకచక్యం, కర్తవ్య దీక్ష ముందు వారి ఆటలు సాగవు అని ఈ సంఘటన నిధర్శనం. పోలీసుల పక్కా వ్యూహంతో సుమారు రెండు కోట్ల రూపాయాల విలువైన భారీ గంజాయి స్వాధీనమవ్వడమే కాకుండా, ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్.
కేసు వివరాల్లోకి వెళ్తే...... తేది 20-06-2026 న ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ ప్రాంతానికి భారీ మొత్తంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దేవున్‌పల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ దిశానిర్దేశంలో, పక్కా ప్లాన్‌తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి డియస్పి మధుసూధన్ పర్యవేక్షణలో కామారెడ్డి రూరల్ సిఐ శ్రీధర్, దేవనపల్లి యస్ ఐ రంజిత్, బీబీపేట్ ఎస్‌ఐ కె. విజయ్, పిట్లం ఎస్‌ఐ బి. అంజనేయులు, మాచారెడ్డి ఎస్‌ఐ అనిల్, సదాశివనగర్ ఎస్‌ఐ పుష్పరాజ్ మరియు సిబ్బందితో కూడిన ఐదు ప్రత్యేక బృందాలు అప్రమత్తమై జిల్లా రహదారులను వాహనాల తనిఖీతో ప్రతీ వాహనంను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇలా ఉండగా జాతీయ రహదారి-44 పై క్యాసంపల్లి గ్రామ శివారులోని రాయల్ ధాబా సమీపంలో చేస్తున్న తనిఖీలలో సాయంత్రం 6 గం.ల సమయములొ అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం అనుమనస్పదముగా కనిపించింది. వెంటనే అప్రమాత్తమై విచారించగ వాహనంలో ఉన్నవారి మాటలకు చేస్తున్న పనసపండ్ల వ్యాపారానికి, వాహనంలో ఎలాంటి అమరిక లేకుండా చిందరవందరగా పడవేసి ఉన్న పనస పండ్ల వరుస క్రమానికి పొంతన
లేకపోవడముతో వాహనంను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఈ భారీ గంజాయి అక్రమ రవాణా బయటపడింది. ఒడిశా రాష్ట్రం నుండి మహారాష్ట్రలోని నాసిక్ కి వాహనం పైభాగంలో పనసపండ్లు ఉంచి ఎవరికి అనుమానం రాకుండా వాటి కింద సంచుల్లో భారీ మొత్తంలో నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి గంజాయిని సేకరించి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నట్లు అంగీకరించారు. అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా మొత్తం 387.128 కిలోల గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,93,56,400/-గా ఉంటుంది.
అరెస్టు చేసిన నిందితులు:
1. షేక్ కరిముల్లా @ కరీం, వ: 41 సం, నిజామాబాద్ జిల్లా.
2. గైని సుభాష్, వ: 35 సం, నిజామాబాద్ జిల్లా.
3. షేక్ రహీమ్, వ: 50 సం, నిజామాబాద్ జిల్లా.
స్వాధీనం చేసుకున్న వివరాలు
1. 387.128 కిలోల గంజాయి
2. అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం
3. రెండు ఫోన్లు
4. నగదు రూ.500/-, 5. పనసపండ్లు
ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. గంజాయి సరఫరా గొలుసు, ఆర్థిక లావాదేవీలు మరియు ఈ అక్రమ రవాణా ముఠాలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది అని జిల్లా ఎస్పి గారు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం . రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ...,
“మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినయోగం యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తుంది. జిల్లాలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నాం. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా నిల్వల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించగలరు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ గంజాయి అక్రమ రవాణా ముఠాను పట్టుకొనడములో చకచక్యముగా వ్యవహరించిన కామారెడ్డి డియస్పి మధుసూధన్, కామారెడ్డి రూరల్ సిఐ శ్రీధర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామన్ దేవనపల్లి యస్ ఐ రంజిత్, బీబీపేట్ ఎస్‌ఐ కె. విజయ్, పిట్లం ఎస్‌ఐ బి. అంజనేయులు, మాచారెడ్డి ఎస్‌ఐ అనిల్, సదాశివనగర్ ఎస్‌ఐ పుష్పరాజ్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:38:05
Readmore >