డైలీ భారత్, కామారెడ్డి: అత్యవసరంగా కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందు అనే పేషంట్ కు ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా ఓ పాజిటివ్గ్రూప్ గల రక్తం అవసరం ఉండగా ఒక్క ఫోన్ కాల్ తో రక్తదానానికి ముందుకు వచ్చిన మన కామారెడ్డికి చెందిన శ్రీకాంత్ హుటాహుటిన వచ్చి తన 13 వ సారి రక్తదానం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా రక్త దాత శ్రీకాంత్ మాట్లాడుతూ 13 వ సారి రక్తదానం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు
అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేసిన రక్తదాతకు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్, రంజిత్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పేషంట్ కుటుంబసభ్యులు,బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు