| Daily భారత్
Logo




పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

News

Posted on 2026-06-21 15:41:56

Share: Share


పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

డైలీ భారత్, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు మైనాగురి నుంచి డోమోహనికి బయలు దేరింది. ఉల్లదబారి ఏరియాలో బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్‌ను ఢీకొట్టింది.

దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని జల్పాయ్‌గురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 17 మందిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న దాని ప్రకారం.. గత కొద్దిరోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రోడ్డు మొత్తం బురదతో నిండిపోయింది. బురద కారణంగా వాహనాలు జారుతున్నాయి. బురద కారణంగా బస్సు అదుపుతప్పింది. బస్సు డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును ఢీకొట్టాడు.

Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >