| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

ప్రతి ఒక్కరూ  జయశంకర్ సార్ అడుగుజాడల్లో నడవాలి

టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సాయ గౌడ్ 

 డైలీ భారత్, కామారెడ్డి : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు ఆదివారం టి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు  సాయగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త,  ప్రసిద్ధ విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ సార్  తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. అయన అడుగుజాడల్లో  ప్రతి ఒక్కరు నడవాలన్నారు. తెలంగాణ పట్ల ఆయనకున్న పట్టుదలే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిందని, తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న వివక్ష, నీటి పారుదల సమస్యలు, ఆర్థిక అసమానతలపై లోతైన పరిశోధనలు చేసి, వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన మేధావి జయ శంకర్ సారన్నారు. జయ శంకర్ సార్ కలలు అన్న  రాష్ట్రం నేడు సహకారమైందన్నారు. తెలంగాణ రాష్టం లో  ప్రజల పక్షాన టి ఆర్ ఎస్ నిరంతరం పనిచేస్తుందన్నారు. రైతుల సమస్యలు, విద్యార్థి సమస్యలు, ఉచిత వైద్యం, ఉచిత విద్య సాధించి  జయశంకర్ సార్ కలలు అన్న  స్వరాష్ట్రమే లక్ష్యంగా కామారెడ్డి జిల్లాలో సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో, రాష్ట్రంలో కవితక్క నేతృత్వంలో ముందుకు వెళ్తుంది అన్నారు. టి ఆర్ ఎస్ పార్టీతోనే జయశంకర్ సార్ కలలుగా అన్న తెలంగాణ రాష్ట్రం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమం లో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ టి ఆర్ ఎస్ అధ్యక్షుడు మోసార్ల శ్రీకాంత్ రెడ్డి, కుప్రియల్ గ్రామ ఇన్చార్జ్ లింగం, శివ, అమర్ల బండ ఇంచార్జ్ గుండెల్లి సాయికుమార్,  లక్ష్మన్, రాహుల్,రావణ్, విక్రమాదిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Next సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు
ADVERTISEMENT