డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ఏరియాలో ఇరువురు పిల్లలకు ఎలుకల మందు తినిపించి, తల్లి కూడా తిన్న ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
ఇరువురు చిన్నారులు మృతి.
తల్లి పరిస్థితి విషమం.
ఖమ్మం జిల్లాలింగరాజు,జ్యోతి దంపతుల స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు.
అత్తమమ ల నుంచి వేరుగా కాపురాం పెట్టుకుందామని భర్తను ఒత్తిడి చేయడంతో ఇటీవల ఖమ్మం సిటీలోని త్రీ టౌన్ ఏరియాలో అద్దెకు దిగారు.కుటుంబ సభ్యులు అత్త,మామా ల నుంచి వేరుగా రావడం తప్పని జ్యోతి కి సర్ది చెప్పారు.దింతో ఆదివారం తిరిగి ఇల్లు షిఫ్ట్ కావాల్సి ఉంది.ఇంతలోనే శనివారం రాత్రి సమయంలో 7,5 ఐదేళ్ల వయసు ఉన్న ఇరుసురు చిన్నారులకు బిస్కెట్ లో ఎలుకల మందు కలిపి తినిపియడంతో పెద్ద బాబు స్పాట్ లోనే మృతి చెందగా,చిన్న బాబు ఆపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన ప్రైవేట్ దవాఖాన కు తీసుకెళ్లి వైద్యం అందించారు.
పరిస్థితి చేయి దాటి పోవడంతో చిన్న బాబు కూడా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.తల్లి జ్యోతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.ఇరువురు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.