| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

యోగా గురువులకు సన్మాన కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతి ఆలయంలో ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్,కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో యోగా గురువులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ యోగాతో శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం సమకూరుతుందని పాఠశాల స్థాయిలోనే యోగాను ఒక సబ్జెక్టుగా తీసుకొని విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉన్నదని, ఎన్నో సంవత్సరాల నుండి నిస్వార్ధంగా యోగ పై అవగాహన కల్పిస్తూ వేలాది మందికి యోగ ప్రాధాన్యతను తెలియజేసిన గురువులు గరిపల్లి అంజయ్య, తిమ్మారెడ్డిగారి అంతి రెడ్డి,బండి రాములు,అర్వపల్లి రమేష్, ఎల్లంకి సుదర్శన్ లను సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్న, ఉపాధ్యక్షులు రాజూరి మనోహర్, కొత్త భీమ్ రాజ్,ఆధ్యాత్మిక విభాగం కోశాధికారి నంగునూరి కాశీనాథం లు పాల్గొనడం జరిగింది.

Previous బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి
Next పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా
ADVERTISEMENT