| Daily భారత్
Logo




ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక సంపదల్లో యోగా ఒకటి

News

Posted on 2026-06-21 10:11:41

Share: Share


ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక సంపదల్లో యోగా ఒకటి

యోగాతో మందులు లేని వైద్యం..

అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదల్లో యోగా ఒకటని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగాతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా మనిషి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, సమాజం, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా బలపరుస్తుందన్నారు. ఆధునిక కాలంలో చాలామంది యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం, బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని భావిస్తున్నారని తెలిపారు. కానీ మనిషి శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని సాధించడమే యోగా అసలు లక్ష్యమని పేర్కొన్నారు. మనిషి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాడని, ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఔషధంలా పనిచేస్తుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను విశ్వవ్యాప్తం చేశారని, ఐక్యరాజ్యసమితి వేదికపై 2014 సెప్టెంబర్ 27న యోగాను అంతర్జాతీయ దినోత్సవం గా ప్రకటించాలని ప్రతిపాదించాలని గుర్తు చేశారు. డిసెంబర్ 11న.. 177 దేశాల మద్దతుతో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. యోగాకు కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేవని ప్రతి మనిషి ఆరోగ్యం, శాంతి కోసం రూపొందించిన జీవన విధానమని చెప్పారు. అనంతరం ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.  విద్యార్థులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆయుష్ శాఖ ఆఫీసర్ గంగాదాస్, మేరా యువ భారత్ సమన్వయకర్త రమేష్, డివైఎస్ఓ పవన్ కుమార్, యోగా గురువులు ప్రభాకర్, సిద్ధి రాములు, రామచందర్ రావు, తదితరులు పాల్గొన్నారు. ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్బన్ ఎంఎల్ఏ ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతిరోజు కొన్ని నిమిషాల యోగా..జీవితానికి ఎన్నో సంవత్సరాల ఆరోగ్యాన్నిస్తుందన్నారు. యోగ కేవలం వ్యాయామం కాదని, జీవితం ఎలా గడపాలో నేర్పే విజ్ఞానం అన్నారు.


కార్యక్రమంలో  ఆర్య సమాజ్ అధ్యక్షులు మహంకాళి విజయ్, ఉపాధ్యక్షులు రాజులు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ప్రసన్న, బీజేపీ కార్పొరేటర్ జ్యోతి మురళి, సీనియర్ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, కృష్ణ మారావార్, శ్రీనివాస్  పాల్గొన్నారు.


Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >
Image 1

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

Posted On 2026-08-27 19:00:55

Readmore >
Image 1

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-27 17:17:45

Readmore >
Image 1

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి

Posted On 2026-08-27 17:15:17

Readmore >
Image 1

సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా

Posted On 2026-08-27 16:57:22

Readmore >
Image 1

హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన

Posted On 2026-08-27 16:49:27

Readmore >