Posted on 2026-06-21 08:05:39
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : వైద్యపరంగా సరైన ఆధారాలు లేవని, చికిత్సలో ప్రత్యేక ప్రయోజనం లేదని నిపుణుల కమిటీ నిర్ధారించిన 16 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీపై కేంద్రం నిషేధం విధించింది. ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం కింద, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ మందుల తయారీ, అమ్మకం, పంపిణీని తక్షణమే నిషేధించింది.
రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్థాలను ఒకే మాత్ర లేదా సిరప్ రూపంలో కలిపి తయారు చేయడాన్ని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ అంటారు. అయితే కొన్ని కాంబినేషన్లు రోగులకు అదనపు ప్రయోజనం కలిగించకపోగా, ఆరోగ్య సమస్యలు సృష్టించే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా, 16 కాంబినేషన్లు అహేతుకమైనవని, వాటిని కొనసాగించడం ప్రయోజనకరం కాదని ప్రభుత్వం నిర్ధారించింది.
నిషేధిత జాబితాలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ, కడుపు తిమ్మిర్లకు ఉపయోగించే మందులు, కలబంద ఆధారిత చర్మ సంబంధిత ఉత్పత్తులు ఉన్నాయి . అమోక్సిసిలిన్ + సెరాటియోపెప్టిడేస్, అమోక్సిసిలిన్ + సెరాటియోపెప్టిడేస్ + లాక్టోబాసిల్లస్ స్పోరోజెనెస్, సెఫ్యూరాక్సిమ్ + సెరాటియోపెప్టిడేస్, సెఫాడ్రాక్సిల్ + ప్రోబెనెసిడ్, డైసైక్లోమైన్ + పారాసెటమాల్ + క్లిడినియం బ్రోమైడ్ + క్లోర్డియాజెపాక్సైడ్‌తో పాటు అనేక కలబంద ఆధారిత చర్మ సంబంధిత ఉత్పత్తులు ఉన్నాయి. సురక్షితమైన, ప్రభావవంతమైన, శాస్త్రీయంగా ధ్రువీకరించిన మందులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటమే తమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది..
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >