| Daily భారత్
Logo




సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

News

Posted on 2026-06-22 16:03:21

Share: Share


సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై  అవగాహన సదస్సు

డైలీ భారత్, సూర్యాపేట: అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం జూన్ 26 సందర్భంగా జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ కేంద్రంలో 60 ఫీట్ల రోడ్డు నందు గల జయ జూనియర్ కళాశాల  నందు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సిఐ వెంకటయ్య హాజరై డ్రగ్స్ నిర్మూలన, గంజాయి నిర్మూలన పట్ల విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం జూన్ 26 సందర్భంగా మండల పరిధిలో వారం రోజులపాటు డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థి దశ నుంచే గంజాయి లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసే వ్యసనాల బారిన పడకూడదని పిలుపునిచ్చారు.  గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు. గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలు  వాడినా, విక్రయించినా లేదా రవాణా చేసినా చట్టపరంగా ఎదురయ్యే కఠినమైన శిక్షలను హెచ్చరించారు. 

విద్యార్థులు కేవలం చదువు, క్రీడలపైనే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఎవరైనా మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు డయల్ 100, 112 కు, తెలంగాణ రాష్ట్ర ఈగల్ పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1908 కి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడుతాయని తెలిపారు. మత్తుపదార్థాల రహిత సమాజ స్థాపనకు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా యాంటీ డ్రగ్స్ సోల్జర్ సెల్ఫీ స్టిక్.. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో యాంటీ డ్రగ్ సోల్జర్ సెల్ఫీ స్టిక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు మేము సైతం మాదాకద్రవ్యాల నిర్మూలన సైనికులుగా ఉంటామని సెల్ఫీ స్టిక్ వద్ద ఫోటోలు దిగి పేర్లు నమోదు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM), ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >