Posted on 2025-04-06 19:18:46
డైలీ భారత్, తమిళనాడు:భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెన దేశవ్యాప్తంగా వాణిజ్యం, ఆర్థిక వృద్ధి పెరగడానికి దోహదపడుతుందని, తమిళనాడులో పర్యటకాభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా కోస్తాతీరం రామేశ్వరంలో రూ.8.300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రధాని ఆదివారంనాడు ప్రారంభించారు. వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న రామేశ్వరం పట్టణంలో నిర్మించిన పాంబన్ వంతెన 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రధాని అభివర్ణించారు. ఇందుకోసం అహరం శ్రమించిన ఇంజనీర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ వెర్టికల్ లిఫ్ రైల్వే సీ బ్రిడ్జి దేశంలోనే మొదటిదని, వంతెన కింద నుంచి పెద్దపెద్ద నౌకలు కూడా వెళ్తాయని తెలిపారు. రైళ్లు శరవేగంగా వంతెనపై దూసుకెళ్తాయని, కొత్త రైలు, ఒక నౌకను కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభించానని చెప్పారు. కాగా, మోదీ తన పర్యటనలో భాగంగా రామేశ్వరంలోని ప్రఖ్యాత రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >