Posted on 2025-02-26 15:44:48
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలోని శివాలయంలో శ్రీ శివపార్వంతర కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే దేవాలయం ప్రాంగణం లో బీఆర్ ఎస్ నాయకుడు భీమారం వీరేషం గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్ ప్రారంభించారు. అంతకు మునుపు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కల్యాణ మాసంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను పొందారు. ఈ సందర్భంగా వై. రవీందర్ యాదవ్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన శివనామ స్మరణ చేస్తే మనకు మనశ్శాంతి కలగడంతో పాటు మన జీవితంలో సుఖశాంతులు ఉంటాయని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు తమ ఇష్ట దైవాన్ని కొలవాలని, నేటితరం యువత హిందూ ధర్మంపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకొని ఆ దిశగా పయనించాలని కోరారు. శివరాత్రి పర్వదినాన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల భీమారం వీరేశం పనితీరును ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, నాయకులు వీరేశం గుప్తా, రాయికల్ వెంకట్ రెడ్డి, యాదయ్య గౌడ్, మాజీ సర్పంచులు దామోదర్, చంద్రశేఖర్, శ్రీశైలం యాదవ్, చందు నాయక్, సాయి ప్రసాద్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు హాన్య నాయక్, శివరాజ్ యాదవ్, స్థానికులు బండాల బాలరాజు, సాయిలు, రాం రెడ్డి, లోకేష్, సలీం, సుధాకర్, యాదయ్య, పోమాల బాలరాజు, రాజు, సి. యాదయ్య, శివ, గుండు అశోక్, నవీన్ పులిజాల, భువనేశ్వర్ రెడ్డి, దుమ్మని నవీన్, నరేష్, వెంకటేష్ గుప్తా, సంతోష్ నాయక్, శీలం శ్రీకాంత్, రాజశేఖర్, ప్రవీణ్ చారి, సంజు నాయక్ గ్రామస్థులు పాల్గొన్నారు..
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >