| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు  మృతి

డైలీ భారత్, మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల వివరాల ప్రకారం.. మండపేట బైపాస్ రోడ్‌లోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఇసుక టిప్పర్ లారీ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Previous ఏపీడబ్ల్యూజేకి హైకోర్టులో చుక్కెదురు
Next ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
ADVERTISEMENT