| Daily భారత్
Logo




ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..

News

Posted on 2026-05-09 13:56:47

Share: Share


ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..

ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం.. తీవ్రరక్తస్రావంతో పరిస్థితి విషమం

డైలీ భారత్, ఏలూరు: ఆధ్యాత్మిక బోధనలు చేయాల్సిన ఒక చర్చి పాస్టర్, బాలికపై వరుసగా అత్యాచారానికి పాల్పడి ఆమె ప్రాణాలతో చెలగాటమాడిన దారుణ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది

నిందితుడు తన కామవాంఛను తీర్చుకోవడమే కాకుండా, బాలిక గర్భం దాల్చకుండా ఉండేందుకు బలవంతంగా గర్భనిరోధక మాత్రలను వాడించడంతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలానికి చెందిన చౌటపల్లి రాంబాబు (42) అనే వ్యక్తి స్థానికంగా చర్చి ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు నిర్వహిస్తుండేవాడు. నిరుపేద కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కన్నేసిన ఈ పాస్టర్, ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇటీవలే బాలికకు నెలసరి రాకపోవడంతో, ఆ పాస్టర్ స్వయంగా గర్భనిరోధక మాత్రలు తెచ్చి ఆమెతో అధిక మోతాదులో మింగించాడు. మాత్రల ప్రభావంతో బాలికకు విపరీతంగా రక్తస్రావం మొదలైంది. పరిస్థితి విషమించడంతో ప్రాణభయంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా లేదని సమాచారం. ఈ క్రూరత్వానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వల్లీపద్మ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


#POCSO

Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >