| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం పరిశీలించారు.

ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, నిరంతర పర్యవేక్షణ కొనసాగించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా గోదాం పరిసర ప్రాంతాల భద్రత, రికార్డుల నిర్వహణ, సీలింగ్ ప్రక్రియ తదితర అంశాలను పరిశీలించారు.

Previous మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Next లేడీ డీఎస్పీ నిర్వాకం.. అసలు గుట్టు విప్పిన రూరల్ పోలీసులు
ADVERTISEMENT