| Daily భారత్
Logo




శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు

News

Posted on 2025-02-26 15:10:06

Share: Share


శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు

చౌడమగుట్ట హనుమాన్ దేవాలయంలో ఘనంగా శివపార్వతుల  కళ్యాణ మహోత్సవం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణ చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయంలో  లోక కళ్యాణం కొరకై జరుపుతున్న  శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవస్థాన కమిటీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులను సాధనంగా ఆహ్వానించి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు, జగత్తుకే ఆది దేవతలైన శివ పార్వతుల కళ్యాణాన్ని ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో గల చౌడమ్మ గుట్ట లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న షాద్నగర్ గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనురాధ దంపతులు జగత్తుకే ఆది దేవతలైన  ఆ శివపార్వతుల కళ్యాణాన్ని దగ్గరుండి మరీ జరిపించారు. కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత  వేద పురోహితులచే  వీర్లపల్లి శంకర్ దంపతులకు  ఆశీర్వచనాలు అందజేయబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  లోక కళ్యాణం కొరకై జరుగు శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తూ, శివపార్వతుల కరుణ కృపా కటాక్షాల వలన సుఖ సంతోషాలతో వెలుగొందాలని  ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రభుత్వము ద్వారా  ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, పేదరికము లేని తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులతో పాటు, చౌడమ్మ కుట్ట హనుమాన్ దేవాలయం వేద పురోహితులు, అశేషమైన శివ భక్తులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు, విశేషమైన భక్త బృందం, తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >