Posted on 2025-02-24 22:54:35
గుమ్మడిదల డంపింగ్ యార్డ్ పనులను నిలిపివేయాలి
చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రజా సేకరణ చేయకుండా పనులు ఎలా నిర్మిస్తారు,
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్.
దుందిగల్ ఎయిర్ కమాండర్ బేస్, డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు లేఖ,
డైలీ భారత్, పటాన్చెరువు: గుమ్మడిదల మండలం నల్లవల్లి,ప్యారా నగర్ లో జిహెచ్ఎంసి వారు ఏర్పాటు చేస్తున్న చెత్త డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేడు డిమాండ్ చేయడం జరిగింది. నేడు సిపిఎం పార్టీ పటాన్చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పటాన్చెరులోని ఐలా భవన్లో నేడు నల్లవల్లి ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంను ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు మాట్లాడుతూ నల్లవల్లి ప్యారా నగర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారా నగర్ గ్రామంలో 152 ఎకరాల భూమిలో జిహెచ్ఎంసి పరిధిలోని చెత్త వేయడానికి జిహెచ్ఎంసితో రామ్ కి ప్రైవేట్ సంస్థ డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను చేపట్టిందని అన్నారు. గ్రామంలోని ప్రజల వద్ద ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. గతంలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కోసం 1500 ఎకరాలు, డి ఆర్ డి ఏ కోసం 5000 ఎకరాలు ఐదు వేల ఎకరాలు భూ సేకరణ చేశారని అన్నారు. ఆ భూముల సేకరణ ప్రజాభిప్రాయంతో చేశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ కోసం సమావేశం నిర్వహించకుండానే డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఏ రకంగా సిద్ధపడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి డంపింగ్ యార్డ్ నిర్మించవద్దని 13 గ్రామపంచాయతీలలో తీర్మానాలు చేశారని అన్నారు. విమానాలకు ఇబ్బందులు కలుగుతాయని ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టవద్దని దుండిగల్ ఎయిర్ బేస్ కమాండర్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి లేఖ రాశారని అన్నారు. డంపింగ్ యార్డ్ ప్రాంతంలో మా మా భూములు ఉన్నాయని కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఇందులో 750 ఎకరాల భూమిని సర్వే చేసి హద్దు బందులు చూపాలని అప్పటివరకు ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ రామ్ కి జిహెచ్ఎంసి లు నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. జిహెచ్ఎంసి చర్యల వలన నల్లవల్లి ప్యార నగర్ మరియు కొత్తపల్లి గుమ్మడిదల మంబాపూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం వలన చుట్టుపక్క గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. 2019 సంవత్సరంలో జిహెచ్ఎంసి పరిధిలో రోజుకు 35 టన్నుల చెత్త సేకరణ ఉంటే, ప్రస్తుతం రోజుకు 8 టన్నుల చెత్తను సేకరించడం జరుగుతుందని అన్నారు. వచ్చే రోజుల్లో అది 9000 టన్నులకు చేరే అవకాశం ఉందని అన్నారు. అందుకోసం డంపింగ్ యార్డ్ ను జనావాసాల మధ్యన కాకుండా వేరే ప్రాంతంలో వేయాలని, డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ నిర్మాణంతో చెరువులు కుంటలలో ఉన్న నీరు పూర్తిగా కలుషితమ అయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రజలకు చర్మ అంటూ వ్యాధులు వచ్చి రోగాల బారిన పడే అవకాశం ఉందని గుర్తు చేశారు. స్వచ్ఛమైన గాలి నీరు లేకుండా పోతుందని అన్నారు. పచ్చని పంట పొలాలు పశుసంపద నాశనం అవుతుందని అన్నారు. ప్రజలకు పర్యావరణానికి నష్టం కలిగించే డంపు యార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని, ప్యారా నగర్ ను మరో జవహర్ నగర్ గా మారుస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ప్రస్తుతం బొంతపల్లి గుమ్మడిదల నల్లవల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీసు చెక్పోస్టులను వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సమస్యపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే గుమ్మడిదల నల్లవల్లి గ్రామాలను పర్యటించి ప్రజలకు మద్దతుగా సిపిఎం పార్టీ నిలిచిందని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దాదాపారువందల మందితో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రజల మద్దతును కూడగట్టుకోవడం జరిగిందని అన్నారు. అందుకోసం ఈ ఆందోళనను మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. సిపిఎం జిల్లా నాయకులు పాండురంగారెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అశోక్, మహిళా సంఘం నాయకురాలు లలిత, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య మాట్లాడినారు. ఈ కార్యక్రమంకు సిపిఎం పటాన్చెరు ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ కుమార్ శ్రీనివాస్ గౌడ్ నాగప్రసాద్ వీరారావు సదాశివరెడ్డి చంద్ర కిరణ్ సింగ్ కృష్ణ సునీత మూర్తి సురేష్ లు పాల్గొన్నారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >