| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రతా బలగాలతో పాటు సంయుక్తంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లలో మావోయిస్టులకు సంబంధించిన 06 డంప్ లను, 05 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతంగా విధులను నిర్వర్తించిన జిల్లా బాంబు డిస్పోజల్ బృందం సభ్యులను ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.అదేవిధంగా  భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి 10 ఐ.ఇ.డి లను కనుగొని వాటిని అత్యంత చాకచక్యంగా నిర్వీర్యం చేసిన బీడీ టీం సిబ్బందిని అభినందిస్తూ క్లిష్ట పరిస్థితులలో బీడీ టీం ప్రదర్శించిన సమయస్ఫూర్తి,ధైర్యసాహసాలు ఎంతో గర్వకారణమని కొనియాడారు.సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పలు సూచనలు చేస్తూ  సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అటవీ ప్రాంతాలలో తనిఖీలు చేసేటప్పుడు నిర్ణీత నిబంధనలను కచ్చితంగా పాటించాలని,స్వీయ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేశారు.నూతన ఉత్సాహంతో పనిచేస్తూ ప్రతిభ కనబరిచిన 12 మంది బీడీ టీం పోలీస్ సిబ్బందిని శుక్రవారం ఎస్పీ  అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలు,రివార్డులను అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆపరేషన్స్ రవి, బీడీ టీం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Previous రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Next జర్నలిస్టుల ఐక్యతకు నూతన వేదిక..
ADVERTISEMENT