డైలీ భారత్, కామారెడ్డి: రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారాని 3 సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ కామారెడ్డి గొల్లవాడ చెందిన ఉడతల బాలయ్య యాదవ్
కామారెడ్డి గొల్లవాడకు చెందిన ఉడతల బాలయ్య యాదవ్ తన ఇంటి పక్కన గల వ్యక్తి రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టాడు.. తన ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు కలదని అందులో 2 ఫీట్లు ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని అన్నాడు. ఇలా ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం చేపడుతూ రోడ్డున కబ్జా చేయడం వల్ల వచ్చిపోయే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును కబ్జా చేశారని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో 3 సార్లు ఫిర్యాదు చేశాడు. అయినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని, స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ ల దృష్టికి తీసుకెళ్లాడు.. అయినప్పటికీ ఇంటి నిర్మాణం యధావిధిగా కొనసాగుతుంది. దీంతో బాధితులు మీడియా ను ఆశ్రయించాడు. అక్రమ నిర్మాణాన్ని అధికారులు నిలిపివేయాలంటూ మున్సిపల్ కార్యాలయంలో టి పి ఓ వద్ద వేడుకున్నాడు.. వెంటనే ఇంటి నిర్మాణం పనులు నిలిపివేసి రోడ్డు వెడల్పు గా ఉండేలా సహకరించాలని బాధితుడు కోరాడు..