| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు

పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాలలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది ఆడెపు వేణు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, డిఎల్ఎస్ఏ పి.లక్ష్మణాచారి సమన్వయంతో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల భద్రత, హక్కుల పరిరక్షణ మరియు లైంగిక వేధింపుల నివారణ లక్ష్యంగా జాతీయ న్యాయ సేవాధికర సంస్థ (నాల్సా) మార్గదర్శకాల మేరకు “జాగృతి” పథకం – 2025 కింద “సురక్షిత్ బచ్పన్ సురక్షిత్ భవిష్య” కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన 

న్యాయ విజ్ఞాన సదస్సులో బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ కల్పించే పోక్సో చట్టం (పోక్సో యాక్ట్ – 2012) పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పిల్లలు ఎలాంటి భయాందోళనలకు గురైనా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సదస్సులో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్. మల్లేశ్ యాదవ్, లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Previous “ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Next ప్రపంచ వేదికపై భారతీయ కళ
ADVERTISEMENT