| Daily భారత్
Logo




దేశంలోనే తొలి ఈ - ఎఫ్ఐఆర్ నమోదు!

News

Posted on 2025-02-23 16:10:31

Share: Share


దేశంలోనే తొలి ఈ - ఎఫ్ఐఆర్  నమోదు!

వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితుడు..

ఈ - ఎఫ్ఐఆర్అంటే ఏంటంటే?

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: జమ్మూ కాశ్మీర్ లోని విల్గామ్ పోలీస్ స్టేషన్ వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దేశంలో తొలి ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్  నమోదు చేసింది. 

ఇంతియాజ్ అహ్మద్ దార్ అనే వ్యక్తి దాడికి గురైనట్లు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది డిజిటల్ పోలీసింగ్ లో కీలక మలుపు.

అయితే తాజాగా దేశంలోనే తొలి ఈ-ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. అదే ఎలాక్ట్రానిక్‌ ఎఫ్‌ఐఆర్‌. వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈ - ఎఫ్ఐఆర్)నమోదు చేశారు. 

డిజిటల్ పోలీసింగ్‌లో భాగంగా హంద్వారాలోని విల్గామ్ పోలీస్ స్టేషన్ వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు తన మొదటి ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

దార్ తరత్‌పోరా నుండి శ్రీనగర్‌కు ప్రయాణిస్తుండగా విల్గామ్ చేరుకున్న తర్వాత, విల్గామ్‌లోని షెహ్నిపోరా నివాసితులైన ఆషిక్ హుస్సేన్ భట్, గౌహెర్ అహ్మద్ భట్ అనే ఇద్దరు వ్యక్తులు తనను తప్పుగా నిర్బంధించి తనపై దాడి చేశారని ఇంతియాజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

ఈ విషయాన్ని అతను పోలీసులకు వాట్సాప్‌ ద్వారా తెలియజేశాడు. వాట్సాప్‌ ద్వారా వచ్చిన సమాచారంతో విల్గామ్ పోలీసులు (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్లు 115(2),126(2) కింద ఈ-ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.

Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >