| Daily భారత్
Logo




పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

News

Posted on 2026-05-07 16:29:26

Share: Share


పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

సమర్థవంతమైన దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

డైలీ భారత్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి గురువారం నాడు మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కుర్రావత్ రమేష్ (25), మిడ్జిల్ మండలానికి చెందిన వ్యక్తిపై నేరం రుజువుకావడంతో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

2020 నవంబర్ 22వ తేదీన బాధిత బాలికపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. అప్పటి ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేయగా, అప్పటి జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ దర్యాప్తు నిర్వహించి నిందితుడిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.జాన్ కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టి బలమైన వాదనలు వినిపించారు. మిడ్జిల్ ఎస్‌హెచ్‌ఓ పర్యవేక్షణలో సీడీఓలు రమేష్, PC 3229 మరియు శంకర్, PC 2194, అలాగే కోర్టు లైజనింగ్ ఏఎస్ఐ బాలకృష్ణ సాక్షులను క్రమపద్ధతిలో కోర్టులో ప్రవేశపెట్టి కేసు విచారణ సాఫీగా జరిగేలా కృషి చేయడంతో కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకు సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, ప్రజా అభియోజకులను జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్  అభినందించారు.

#MahabubnagarPolice

Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >