Posted on 2026-06-29 08:18:10
కూరెళ్ల గ్రామంలో రైతులతో కలిసి వ్యవసాయ పనులకు శ్రీకారం
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
మంత్రి పొన్నం ప్రభాకర్
డైలీ భారత్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి నాగలి దున్ని, విత్తనాలు చల్లి ఖరీఫ్ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రైతాంగానికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భూమాతను ప్రార్థిస్తూ కూరెళ్ల గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. రైతులు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమాతకు, ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని ఆకాంక్షించే పవిత్రమైన రోజు ఇదన్నారు.
"అన్నం పరబ్రహ్మ స్వరూపం" అని మన పెద్దలు చెప్పారని, ఆ అన్నాన్ని పండించే రైతే దేశానికి వెన్నెముక అని మంత్రి అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని మంత్రి వివరించారు.
రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని పంటలు క్రిమి, కీటకాల బెడద లేకుండా సమృద్ధిగా పండాలని, రైతులకు ఆర్థికంగా మంచి రాబడి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రతి రైతు కుటుంబం భూమాత ఆశీర్వాదంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >