Posted on 2026-06-29 15:19:45
మద్యం మీ కళ్లను మూయవచ్చు.. కానీ మీ కుటుంబ కళ్లలో కన్నీరు నింపకండి!
ఒక్క రోజే 73 మందికి కోర్టు శిక్షలు
రూ.88,700 జరిమానా విధింపు – 15 మందికి జైలు శిక్షలు
రోడ్డు భద్రతే లక్ష్యం – డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడం మరియు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 73 మంది వాహనదారులను పోలీసులు గుర్తించి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలను విధించింది.
జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన మొత్తం 73 మందికి కోర్టు శిక్షలు విధించబడినాయి. ఇందులో 14 మందికి ఒక రోజు జైలు శిక్ష, ఒక వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా, మొత్తం రూ.88,700/- జరిమానా విధించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్టపరమైన నేరమే కాకుండా, అమాయకుల ప్రాణాలను సైతం బలితీసుకునే ప్రమాదకర చర్య అని పేర్కొన్నారు. "మద్యం మీ కళ్లను తాత్కాలికంగా మూయవచ్చు... కానీ మీ కుటుంబ కళ్లలో కన్నీరు నింపకండి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్షణిక మత్తులో తీసుకునే నిర్లక్ష్య నిర్ణయాలు జీవితాంతం బాధను మిగులుస్తాయని ఆయన అన్నారు.
ప్రతి వాహనదారుడు తన కుటుంబం, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని సూచించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరించింది.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >