| Daily భారత్
Logo




పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

News

Posted on 2026-05-07 18:38:07

Share: Share


పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

టెన్త్,ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పిల్లలను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొత్తం 63 మంది పోలీస్ సిబ్బంది పిల్లలు,వారి తల్లీదండ్రులు హాజరయ్యారు.ముందుగా మంచి మార్కులు సాధించిన విద్యార్థిని,విద్యార్థులు కొంతమంది తమ తల్లీదండ్రుల కష్టాన్ని,భవిష్యత్తులో తాము సాధించాలనుకుంటున్న లక్ష్యాలను వివరిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకుగాను ఎస్పీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు. పట్టుదల,క్రమశిక్షణ,ఆత్మ స్థైర్యం  ఉంటే ఎలాంటి కష్టమైన లక్ష్యాన్నైనా సులభంగా సాధించవచ్చని అన్నారు.జీవితంలో ఎల్లప్పుడూ పాఠాలను నేర్చుకుంటూనే ఉండాలని, ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలని తెలిపారు.మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకొని,దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.పోలీస్ కుటుంబంలో పుట్టి పెరిగిన ఎస్పీ బాల్యం నుండి ఐపిఎస్ సాధించే వరకు తన గత స్మృతులను వారితో పంచుకున్నారు. అనంతరం మంచి మార్కులు సాధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు కుటుంబంలోని విద్యార్థినీ,విద్యార్థులకు ఎస్పీ ప్రశంసా పత్రాలతో పాటు మెమొంటోలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సీఐ కరుణాకర్,త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి,ఎంటిఓ సుధాకర్, హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్ఐ నరసింహారావు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >