| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు

12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు

డైలీ భారత్, ఏలూరు: భర్త సంపాదించిన డబ్బులను, ఆ భర్త ప్రాణాలు తీసేందుకు సుపారి కింద చెల్లించిన మహా ఇల్లాలు.. ఉంచుకున్న వాడికోసం కట్టుకున్నోడిని దారుణంగా చంపించిన ఘోరం. ఏలూరులో జరిగిన ఈ దారుణంలో ప్రియుడికి 12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు దుర్గామణి. గత నెల 17న హత్యకు గురైన వడ్లమాను గ్రామానికి చెందిన సులేమాన్ రాజు కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబు అనే వ్యక్తితో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె ప్రేమ వ్యవహారం భర్తకు తెలిసి మందలించాడు. మంచి మాట చెవికి ఎక్కని దుర్గామణి ప్రియుడు కోసం భర్తను చంపేయాలని ప్లాన్ వేసింది. ప్రియుడికి 12. లక్షలు ఇచ్చింది. ఎలా చంపాలో స్కెచ్ కూడా వేసింది.

 దాని ప్రకారం సెల్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజు గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి మృతదేహాన్ని ఉప్పులూరు రైవస్ కాలువలో పడేశారు.

హత్యపై పోలీసులు విచారణ జరపగా, ప్రియుడి కోసం భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల వద్ద నుంచి కారు, సెల్‌ఫోన్లు, నగదు, ఛార్జింగ్ కేబుల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Previous శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Next ప్రపంచాన్ని కలవరపెడుతున్న హంటా వైరస్..
ADVERTISEMENT