డైలీ భారత్, కామారెడ్డి: గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం రోజున నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పక్షాన ముగ్గురిని టిఆర్ఎస్ పక్షాన ఒకరిని ఎన్నుకోవడం జరిగింది టిఆర్ఎస్ పక్షాన కుంభాల రవి యాదవ్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మేరకు టిఆర్ఎస్ శ్రేణులు అనంత ఉత్సవాల మధ్య ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం హైదరాబాదులోని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుంభాల రవి యాదవ్ మాట్లాడుతూ నాపై పూర్తి నమ్మకంతో టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నాపై బాధ్యత ఉంచి టిఆర్ఎస్ తరఫున బాధ్యతలు అప్ప చెప్పినందుకు గంప గోవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు.
News
టిఆర్ఎస్ మున్సిపల్ కోఆప్షన్ గా కుంభాల రవి యాదవ్