| Daily భారత్
Logo




మాయ మాయ అంతా చిప్ మాయ....పెట్రోల్ బంకులో ఘరానా మోసం..

News

Posted on 2025-02-21 10:40:59

Share: Share


మాయ మాయ అంతా చిప్ మాయ....పెట్రోల్ బంకులో ఘరానా మోసం..

వాహనదారులు ఇది విన్నారా..పోనీ చదివారా.....అయితే మీ కోసమే...ఈ జిల్లా వాసులు మీరు జాగ్రత్తగా ఉండాలి....

మాయ మాయ అంతా చిప్ మాయ....పెట్రోల్ బంకులో ఘరానా మోసం.. మీటర్ ట్యాంపరింగ్‌తో రూ.కోట్లు కొల్లగొట్టారు..!

గతంలో ఇలాంటి మోసం...పల్నాడు జిల్లా.... పిడుగురాళ్ళ లో కూడా జరిగింది... బంక్ కూడా సీజ్ చేయడం జరిగింది... కొన్ని రోజులకి ఓపెన్ చేయడం కూడా జరిగింది... అంతా..పెరుమాళ్లకే ఎరుక!

అనంతపురం పెట్రోల్ బంకుల్లో అనేక రకాల మోసాలు మనం చూసాం…

డైలీ భారత్ ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగిన ఈ మోసం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు అంటున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు… 

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో పెట్రోల్ బంకులు కొత్త రకం మోసం బయటపడింది. 

ఎలక్ట్రికల్ చిప్ అమర్చి రీడింగ్ ను టాంపర్ చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యాలు… 

వాహనదారులను నిలువున మోసం చేస్తున్నాయి. ఆఖరికి లీగల్ మెట్రాలాజీ అధికారులకు కూడా తెలియకుండా మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ ల గుట్టును విజిలెన్స్ అధికారులు బట్ట బయలు చేశారు.

శ్రీ విజయలక్ష్మి ఆటో కేర్ అండ్ ఫ్యూయల్ స్టేషన్ అనే పెట్రోల్ బంకులో తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ పంపులను తనిఖీ చేయగా… డీజిల్ పంప్ ఉన్న డిజిటల్ మీటర్ కు చిప్ అమర్చి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏడాది క్రితం డీజిల్ పంపుకు హైదరాబాదు నుంచి ఓ టెక్నీషియన్ ను తీసుకొచ్చి చిప్ అమర్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

ఒక్క సంవత్సరంలో రెండు లక్షల పై చిలుకు లీటర్ల డీజిల్ ని మిగుల్చుకున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం… వాహనదారుల నుంచి దాదాపు రెండు కోట్ల పైచిలుకు డబ్బు అక్రమంగా సంపాదించినట్లు తెలుసుకున్న విజిలెన్స్ అధికారులే కంగుతున్నారు. దీంతో విజయలక్ష్మి ఆటో కేర్ ఫ్యూయల్ స్టేషన్ పెట్రోల్ బంకులో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో చిప్ బాగోతం బయటపడింది. ఒక సంవత్సరంలోనే సుమారు ఒక పంపు ద్వారా రెండు కోట్ల పైచిలుకు రూపాయిలు మోసం చేసినట్లు విజిలెన్స్ తనిఖీల్లో అధికారులు గుర్తించారు.

ఇలాంటి చిప్ లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ లు జిల్లాల్లో ఇంకా ఉన్నట్లు… అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేస్తాం అంటున్నారు విజిలెన్స్ డిఎస్పి నాగభూషణం…. ఈ తరహా ఎలక్ట్రికల్ చీప్ అమర్చి పెట్రోల్ బంకుల్లో డీజిల్ మోసం చేయడం ఇదే మొదటిసారి అంటున్నారు విజిలెన్స్ అధికారులు. గతంలో తూనికలు కొలతలకు సంబంధించిన అధికారులు సీల్ను తొలగించి అనేక మోసాలకు పాల్ప పెట్రోల్ బంక్ యజమానులు… ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ చిప్ అమర్చి మోసాలకు పాల్పడటం అధికారులను విస్మయానికి గురిచేస్తుంది.

Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >
Image 1

రాఖీ పండుగ

Posted On 2026-08-28 02:56:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Posted On 2026-08-27 19:02:09

Readmore >
Image 1

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

Posted On 2026-08-27 19:00:55

Readmore >
Image 1

అంతంపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-27 17:17:45

Readmore >
Image 1

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి

Posted On 2026-08-27 17:15:17

Readmore >
Image 1

సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా

Posted On 2026-08-27 16:57:22

Readmore >
Image 1

హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన

Posted On 2026-08-27 16:49:27

Readmore >