Posted on 2025-02-21 10:42:25
డైలీ భారత్, ఖమ్మం :ఖమ్మం జిల్లాలోని శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది, ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది,
తన హాస్టల్ గదిలోనే ఉరి వేసుకున్నట్లు తెలుస్తుంది.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయి నట్లు వైద్యులు నిర్ధారించా రు. ఆమె స్వస్థలం ఏపీ లోని అల్లూరి జిల్లా ఏట పాక గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
కాగా విద్యార్థిని ఆత్మహ త్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలసుకున్న విద్యార్థి సంఘాలు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు...
ఆమె కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘట నపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >