| Daily భారత్
Logo




ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్

News

Posted on 2025-02-18 13:33:16

Share: Share


ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్

వనపర్తి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీత.

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని, జిల్లా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీత తెలిపారు. 

మంగళవారం జిల్లా ప్రధాన న్యాయస్థానంలో సమావేశ మందిరంలో మార్చి 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వీ రజనీతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మార్చి 8వ తేదీన జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను, వివాదాలను పరిష్కరించుకోవచ్చు అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కోర్టులకు వెచ్చించే సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, కోర్ట్ ఫీజు కూడా వాపస్ పొందవచ్చు అని చెప్పారు. ఏదైనా కేసు ఒకసారి లోక్ అదాలత్ పరిష్కారం అయ్యింది అంటే అది శాశ్వతంగా పరిష్కారమైనట్లేనని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమవుతున్న కేసుల విషయంలో, రాష్ట్రంలో వనపర్తి జిల్లా స్థానం రాను రాను మెరుగుపడుతోందన్నారు. గత డిసెంబర్ 14 వ తేదీన  నిర్వహించిన లోక్ అదాలత్ లో వనపర్తి జిల్లా కోర్టు అత్యధిక కేసులను పరిష్కారం చేసి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచిందని చెప్పారు. మార్చి 8వ తేదీన జరగబోయే లోక్ అదాలత్ లో మరిన్ని కేసుల పరిష్కారం ద్వారా వనపర్తి జిల్లా కోర్టు మరింత మెరుగైన స్థానాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >