Posted on 2025-02-18 12:41:30
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: తెలంగాణ హైకోర్టులో విషాదం నెలకొంది. హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌రావు గుండెపోటుకు గురయ్యారు. హైకోర్టులో కేసును వాదిస్తున్న సమయంలో న్యాయవాది ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆస్పత్రికి తరలించే లోపే మార్గ మధ్యలోనే వేణుగోపాల్ రావు మృతి చెందారు. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్‌లలో జడ్జిలు విచారణను నిలిపివేశారు. అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేశారు న్యాయమూర్తులు.
హైకోర్టులో ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత ఓ కేసు విషయంలో వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాదనలు వినిపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన తోటి న్యాయవాదులు సీపీఆర్ చేసినప్పటికీ కూడా లాయర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గ మధ్యలోనే వేణుగోపాల్ రావు ప్రాణాలు కోల్పోయారు. కేసు వాదిస్తూ పడిపోయిన సమయంలో కళ్లు తిరిగి పడిపోయారని అంతా భావించారు. వెంటనే ఆస్పత్రిక తరలించగా గుండెపోటుతో న్యాయవాది మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. న్యాయవాది మృతి పట్ల న్యాయమూర్తులు విచారం వ్యక్తం చేస్తూ అన్ని విచారణలను వాయిదా వేశారు. సీనియర్ న్యాయవాది మృతితో తోటి లాయర్లు ఆవేదన వ్యక్తం చేశారు
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >