Posted on 2024-09-02 11:54:25
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్బంగా ఎల్. బి నగర్ నియోజకవర్గం కామినేని చౌరస్తాలో వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎల్. బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి.
ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహానేత వైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల సంక్షేమ అభివృద్ధి కొరకు పాటు పడేవారని, 108, 104, ఆరోగ్యశ్రీ,పావలా వడ్డీ, జలయజ్ఞం, రుణమాఫీ,ఉచిత విద్యుత్, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి ఎన్నో పథకాలు ప్రజల కోసం తీసుకువచ్చిన మహా నాయకుడు వైయస్సార్ అని కొనియాడారు... వైయస్సార్ గారు తీసుకువచ్చిన ఎన్నో పథకాలు నేటి వరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, ఇప్పటికీ ఎప్పటికీ పేద ప్రజల గుండెల్లో వైయస్సార్ ఒక చెదరని సంతకం అని, వైయస్ రాజశేఖర్ రెడ్డి తో ఆయనకున్న జ్ఞాపకాలు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఎర్రంబెల్లి సతీష్ రెడ్డి, కోలన్ సుధాకర్ గౌడ్ , జైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు పృధ్వీరాజ్, నరసింహారావు, శ్యామల్ రెడ్డి, శంకరయ్య, విటల్ రెడ్డి, రాజశేఖర్ మరియు గిరిజన నాయకులు గాంధీ నాయక్, బుంగరాజు అశోక్, అజయ్,అక్రమ్,సతీష్ మరియు మహిళా నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు....
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >