Posted on 2026-07-23 16:04:59
సుజాతనగర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో గల కమ్మవారి కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం నిర్వహించనున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ,బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు పాల్గొంటారు విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >