| Daily భారత్
Logo




వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

News

Posted on 2026-07-23 15:59:08

Share: Share


వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి భరోసా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా పోలీసింగ్ నిర్వహించాలి.

విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలి.

పాత నేరస్తులు, సస్పెక్ట్ వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి ముందస్తు నేర నివారణ చర్యలు చేపట్టాలి.

గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి.

ప్రతి పిటిషన్‌ను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి.

జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ 

డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యెల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్‌హెచ్‌ఓ నరేష్ ఎస్పీ గారికి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ గారు యూనిఫాం టర్నౌట్‌ను పరిశీలించి, సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణ, క్రమశిక్షణ, ప్రజాసేవలపై సమీక్ష నిర్వహించారు. అధికారులకు ఇచ్చిన సూచనలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉందా లేదా అన్నది స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

తదుపరి పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, లాకప్, బ్యారెక్స్, టెక్నికల్ రూమ్, స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, సీజ్ చేసిన వాహనాల వివరాలు, స్టేషన్ భౌగోళిక మ్యాప్, క్రైమ్ హాట్‌స్పాట్స్ తదితర అంశాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిపై ఎస్‌హెచ్‌ఓను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

అలాగే పోలీస్ స్టేషన్‌లో కేసుల నమోదు విధానం, ఆన్‌లైన్ CCTNS వ్యవస్థ పనితీరు, ఫిర్యాదుదారులను స్వీకరించే విధానం, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. ప్రతి పిటిషన్‌ను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యను పూర్తిగా తెలుసుకొని చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం, భద్రత, భరోసా పెంపొందేలా పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించాలని, ప్రతి విలేజ్ పోలీస్ ఆఫీసర్ తమకు కేటాయించిన గ్రామాన్ని నిరంతరం సందర్శిస్తూ గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై ప్రమాద హాట్‌స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దొంగతనాల నివారణకు ముందస్తు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, పాత నేరస్తులు, సస్పెక్ట్ వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని, కేసుల డిటెక్షన్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, గణేష్ మండపాల వద్ద భద్రత, నిర్వాహక కమిటీలతో సమన్వయం తదితర అంశాలపై ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో యెల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్‌హెచ్‌ఓ నరేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >