Posted on 2026-07-23 15:56:26
38 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులు కోర్టు ముందు హాజరు
రూ.43,500 జరిమానా విధింపు – 5 మందికి ఒక రోజు జైలు శిక్ష
డైలీ భారత్, కామారెడ్డి : రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 38 మందిని గుర్తించి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి మొత్తం రూ.43,500 జరిమానా విధించింది. అదేవిధంగా 5 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS మాట్లాడుతూ, "మద్యం సేవించి వాహనం నడపడం ఒక చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు... ఒక కుటుంబం జీవితాన్ని శాశ్వతంగా విషాదంలోకి నెట్టివేసే ప్రమాదకరమైన చర్య. మీ కోసం ఇంట్లో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. క్షణిక ఆనందం కోసం తీసుకునే నిర్లక్ష్య నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపానికి కారణం కావొద్దు. మీ ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణించే అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కామారెడ్డి జిల్లా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి జరిమానాలు, జైలు శిక్షలు సహా చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం. మీ కుటుంబం కోసం... మీ ప్రాణం కోసం... సమాజ భద్రత కోసం మద్యం సేవించి వాహనాలు నడపవద్దు" అని తెలిపారు
జిల్లా పోలీసుల విజ్ఞప్తి:
మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించండి.
మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడండి.
కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రజల భద్రతే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలను నిరంతరం కొనసాగిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >